kaargil kavita-4
'Line of Controll'
ఓ తీవ్రవాది!
గీసుకున్న గీతలకే (L.O.C.) గాటు పెట్టి,ఎదురింట్లో కాలు పెట్టి, అధునాతన ఆయుధాలతో,కనపడితే కాల్చడం,గుండెలనే చీల్చడం..నీకు అదేం సంతొషం ?
ఎంతైన మీరు తినేది మానవత్వం,త్రాగేది మనిశి రక్తమే కదా? ఏం! అవి మీలో లేవా?
చెట్టంత కొడుకు ను కోల్పోయిన తల్లి వేదన,నిన్న గాక మొన్న నే పెళ్లయి,భర్త ను కోల్పోయిన భార్యల,ఆ అనాథ బాలల రోధన,ఎవన్ని నిజం గా నీకు వినపడటం లేదా?
కాస్త పరికించి చూడు,మనస్సు తో విను,జాగ్రత్త గా వింటే.. నీకు నీ పాత జీవితం,కుటుంభం,తోబుట్టువుల ప్రేమ గుర్తుకు రావడం లేదా ఏమిటి?
----వేణు వింజమూరి (15-7-1999)
0 Comments:
Post a Comment
<< Home