Year End's Shayary
ఓ December 31st సాయం కాలమ్ ,
మా గోడ మూల కి వ్రేళాడే పాత Calender నన్ను బేలగా చూస్తోంది,
మొనం గా సంవత్సరం అంతా తాను చేసిన ఊడిగం సాకు గా చెప్తోంది,
కనికరం లేని గడియారం ముళ్లు చక చకా తిరుగుతున్నాయ్ !
అవి, నే పాత కొత్త లకు ఆతీతం అని తన భాష లొ చెప్తూ ఉన్నాయ్
రేపటి నుంచి తనది కొత్త పరుగని, సూర్యుడు కుడా చిరాకు గా కడులు తున్నాడు,
ఈసారి కి ఇదే చివర కాబోలు అని, చీకటి కూడా భారం గా చిమ్ముతోన్ది,
సెలవిక మిత్రమా అని చల్ల గాలి "2005" తొ అన్టోంది.......
ఇవన్ని పట్టని "నేను" మాత్రం ఈ రాత్రి Neckless Road లో వేసే చిన్డుల కోసమ్ ఆశ గా ఎదురు చూస్తున్నా..
--మీ వేణు
0 Comments:
Post a Comment
<< Home